ఇవి మీకు తెలుసా ?
|
• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. |
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. |
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. |
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. |
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది. |
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. |
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. |
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. |
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది. |
• బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది. |
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. |
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. |
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది. |
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది. |
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి. |
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు. |
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది. |
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది. |
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. |
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం. |
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. |
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది. |
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. |
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి. |
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది. |
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. |
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. |
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు. |
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి. |
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. |
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది. |
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి. |
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి. |
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. |
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు. |
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. |
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది. |
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. |
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. |
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి. |
Wednesday, 4 March 2015
రాయరాకుల కర్ణాకర్..................
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment